ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. ప్రభుత్వం దీపావళి ధమాకా వార్త చెప్పింది. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ పథకం బుకింగ్స్ ప్రారంభమవుతందన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈనెల 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని అన్నారు. గ్యాస్ కనెక్షన్ ఉండి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులని అన్నారు. అర్హత ఉన్న ప్రతీ కుటుంబం అక్టోబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పారు.
గ్యాస్ సిలిండర్ అందిన వెంటనే మీరు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ప్రభుత్వం తిరిగి డీబీటీ ద్వారా నగదు వెనక్కి ఇచ్చేస్తుందన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 1967 కు కాల్ చేసి సేవలు పొందొచ్చని మంత్రి చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని.. ప్రస్తుతం 1.47 కోట్లు వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.