ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం అయ్యన్న తరపున కూటమి నేతలు నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి మంత్రులు పవన్, నారా లోకేష్, ఇతరులు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్..
