ఈనెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని క్యాబినెట్ హాలులో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఓట్ ఆన్ అకౌంట్‌పై ఇచ్చే ఆర్డినెన్స్‌కు సైతం క్యాబినెట్లో సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇతర మంత్రులు పాల్గొననున్నారు.
జులై 16న ఏపీ క్యాబినెట్ సమావేశం..
