తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైఎస్సార్ 75వ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. న వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాయి. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి..
