ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసు లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్, పోలీస్ అధికారులతో పాటు, అడ్వకేట్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా గతంలో జత్వానీని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేశారనే ఆరోపణలతో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంత రావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పై విచారించిన కోర్టు మంగళవారం ఐదుగురికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.