ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..

farmar-23.jpg

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది. దరికీ పంట బీమా అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దీంతో రైతులకు చాలా మేలు జరగనుంది. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలని సచివాలయంలో సబ్ కమిటీలోని మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల, నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. కేంద్రం సూచించిన విధానాల్లో ఉత్తమ విధానం అమలు చేయాలని అధికారులను వారు ఆదేశించారు. బీమా అమలు, క్లైమ్లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి నివేదికను సీఎం చంద్రబాబుకు అందించారు. పెరిగిన పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో బీమా ప్రీమియం భారం రైతులపై పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకూ ఉచిత పంటల బీమా అమలు చేయనుంది. కరువు, తుపాను వంటి విపత్తులతోపాటు వాతావరణ ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయిన పరిస్థితుల్లో ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Share this post

scroll to top