ఏపీలో గత వారం రోజులుగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా పంట నష్టం సంభవించింది. కష్టపడి పంట పండించిన రైతన్న ఇలా వర్షాలకు పంట దెబ్బతినటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద సాయం మీద, పంట నష్టపోయిన రైతులకు అందించే సాయం గురించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంట నష్టం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం చేయడం లేదని వైఎస్ షర్మిల నిలదీశారు. నేటికీ దాదాపు మూడు వారాలు, అటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు, మరిన్ని కోస్తా ప్రాంతాల్లో పంటలు, పల్లెలు నీటమునిగి. రైతుల అర్తనాధాలు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పటికీ మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా ముఖ్యమంత్రిగారు, రైతులు, ప్రజలూ అల్లకల్లోలంలో కొట్టుకుపోతున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్లీ తాజాగా కోనసీమ వరదనీటిలో చిక్కుకుంది. ఇప్పుడు చేస్తున్న సాయం మీద స్పష్టత ఏది?” అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
సుమారు రెండు లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి..
