మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆళ్ల నాని చేరికకు పార్టీ పెద్దలు అంగీకరించినట్లుగా సమాచారం. దీంతో నేడో ,రేపో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఏలూరు నుంచి నాలుగో సారి పోటీచేసి ఓటమి పాలైన ఆళ్ల నాని రాకను వేలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.