ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం ఈ విడుదల చేసింది. ఇందేలో భాగంగా గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు, అర్బన్ పరిధిలో సంస్థలకు రూ.454 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని తాము మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక సంస్థలను పటిష్టంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
స్థానిక సంస్థలకు భారీగా నిధులు..
