పర్యావరణ విధ్వంసం పై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విశాఖ తీరంలో అక్రమ తవ్వకాలు వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) నుంచి పొందిన అనుమతులను ఉల్లంఘించి.. కొండలను కొల్లగొడుతున్నట్టు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. ఎర్రమట్టి కొండలు రియల్ ఎస్టేట్ లే అవుట్ గా మారిపోతున్నాయి. GVMC టౌన్ ప్లానింగ్ విభాగం అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అయితే సర్వే నెంబర్ 118/5లో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించింది. మరోవైపు, ఎర్రమట్టి కొండల్లో తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని ప్రాథమికంగా తేల్చారు అధికారులు.. ఇక, ప్రభుత్వ ఆదేశాలతో వివాదాస్పద తవ్వకాలను పరిశీలించారు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. మొత్తంగా అనుమతులను ఉల్లంఘించి కొండలను కొల్లగొడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఎర్రమట్టి కొండల్లో తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని ప్రాథమికంగా తేల్చడంతో. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై ప్రభుత్వం సీరియస్..
