తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కి హైకోర్టులో ఊరట దక్కింది. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో ఆ రోజు నుంచి తాడిపత్రిలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు పోలీసులు. పోలీసులు తాడిపత్రిలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి. అయితే, తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి షరతులతో అనుమతి ఇచ్చింది హైకోర్టు. తాడిపత్రికి పదుల సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా వెళ్ళొద్దని కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే తాడిపత్రికి వెళ్ళాలని ఆదేశించింది. మరోవైపు తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి తగిన భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఎస్పీ జగదీష్ ను కలిసి ఒకటి, రెండు రోజుల్లో తాడిపత్రి వెళ్లేందకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధం అవుతుండగా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట..
