అక్రమ వసూళ్లు,సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగదీష్ తొలగింపు..

anithaa-.jpg

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏపై వేటు పడింది. అక్రమ వసూళ్లు,సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్ ను తొలగించారు. పది సంవత్సరాలుగా వంగలపూడి అనిత దగ్గర ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్నారు జగదీష్. అయితే హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత బదిలీలు, పోస్టింగులకు సిఫార్సు చేయడానికి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని జగదీష్ పై తీవ్ర ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇక ఇది గ్రహించిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అలర్ట్‌ అయ్యారు. దీంతో పీఏ జగదీష్ ను తొలగించారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.

Share this post

scroll to top