ఏపీలో హైటెన్షన్..

praveen-26.jpg

రాజమండ్రిలో ఓ పాస్టర్‌ హత్య కలకలం రేపుతోంది. క్రైస్తవ బోధకుడిగా ఉన్న పాస్టర్‌ ప్రవీణ్‌ను కొందరు హైవేపై అనుమానాస్పదంగా హత్య చేశారు. అయితే తనకి ప్రాణహాని ఉందని నెల క్రితమే ప్రవీణ్‌ చెప్పారు. దీంతో ఆయనది హత్యే అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రవీణ్‌ మృతదేహాన్ని పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్‌ దగ్గర హైటెన్షన్ నెలకొంది. ప్రవీణ్‌ను హత్య చేశారంటూ ఆస్పత్రి దగ్గర పాస్టర్‌లంతా ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ప్రవీణ్‌ను హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని ఆరోపణ వస్తున్నాయి. కొంతమూరు హైవే పక్కన అనుమానాస్పద స్థితిలో ప్రవీణ్‌ మృతదేహం కనిపించింది. అంతేకాకుండా ఒంటిపై గాయాలు ఉండటంతో ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని పాస్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

ఎయిర్‌పోర్టు నుంచి ప్రమాదం జరిగిన స్థలం వరకు సంబంధించిన మొత్తం సీసీ ఫుటేజీని బయటపెట్టాలని పాస్టర్లు అంటున్నారు. పాస్టర్‌ ప్రవీణ్‌ మృతికి సినీనటుడు రాజా కూడా సంతాపం తెలిపారు. దివాన్‌ చెరువు హైవేలో నాలుగో బ్రిడ్జి దగ్గర రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడని తెలుస్తోంది. బైక్‌పై వెళ్తుండగా ఘటన జరిగిందని చెబుతున్నారు. రాత్రి నుంచి సంబంధీకులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ప్రవీణ్‌ రెస్పాండ్‌ రాలేదు. ఆ తర్వాత మృతి చెందినట్టు పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు, పోలీసులు సైతం ప్రమాదం కాదు, ముఖంపై ఎన్నో గాయాలున్నాయని చెప్పారని పాస్టర్లు అంటున్నారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్‌ మృతి వెనుక ఉన్న కారణాలు తెలపాలని కోరుతున్నారు. 

Share this post

scroll to top