దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం నాడు విజయవాడ ఏపీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని షర్మిల ఎగురవేశారు. గత 10 ఏళ్లుగా అరాచకాలు చూస్తున్నామని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మత తత్వ పార్టీ హర్ ఘర్ తిరంగ అని మోడీ ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారని, దేశ భక్తి ఉన్నట్లు బీజేపీ సర్టిఫై చేస్తుందట అని సెటైర్లు వేశారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అన చెప్పారు. ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని, జాతీయ జెండాన్ని బీజేపీ, RSS అవమించిందని మండిపడ్డారు. మూడు రంగుల జెండాను గౌరవించమని ఆర్ఎస్ఎస్ చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 001 వరకు ఆర్ఎస్‌ఎస్ పార్టీ ఆఫీస్‌లో జాతీయ జెండాను ఎగరవేయలేదన్నారు. నిజానికి ఈ దేశానికి మోడీ చేసింది ఏమీ లేదన్నారు. హర్ గర్‌ను మోడీ మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అని మోసం చేశారన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేశారని.. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం అని మోసం చేశారని విమర్శలు గుప్పించారు.
బీజేపీ మతతత్వ పార్టీ.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..
