కాలీఫ్లవర్ తింటే రుచితో పాటు అనేక ప్రయోజనాలు..

califlower-05.jpg

ఆరోగ్యంగా ఉండేందు కోసం సీజనల్ పండ్లు, కూరగాయలను తినడం చాలా ముఖ్యం. అందులో కాలీఫ్లవర్ ఒకటి, ఇది రుచికి మాత్రమే కాకుండా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. కాలీఫ్లవర్‌లో అనేక పోషకాలు, మొక్కల ఆధారిత సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు కనుగొన్నారు.

కాలీఫ్లవర్ చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. దీనిలో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ కె వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. అయితే కొంతమంది క్యాలీఫ్లవర్‌ను ఎక్కువగా తినకూడదని మీకు తెలుసా దీంతో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. కాలీఫ్లవర్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 100 గ్రాముల కాలీఫ్లవర్‌లో 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మీ పొట్టలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పోషించి మంచి జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉన్నట్లు కనుగొన్నారు. అంతే కాకుండా కాలీఫ్లవర్ యాంటీఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలం. ఇది మీ కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

Share this post

scroll to top