పాతబస్తీలోని కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీలో జరిగిన కూల్చివేతలపై మొదటిసారి అసదుద్దీన్ స్పందించారు. నిజామాబాద్‌లో జరిగిన ఎంఐఎం సభలో అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి రావద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధికి మద్దతిస్తాం కానీ పేదలను ఇబ్బంది పెడితే అసలు ఉరుకునే ప్రసక్తి లేదని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సచివాలయం, బాపు ఘాట్‌తో పాటు ఎన్నో ప్రముఖ కట్టడాలు కూడా FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. సచివాలయం FTL పరిధిలో ఉన్నప్పుడు లేని ఇబ్బంది.. పేదల ఇళ్లు ఉంటే ఎందుకని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతల్లో పేదలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ హామీల్లో పేదల సంక్షేమం కూడా ఉందని మర్చిపోవద్దని ఓవైసీ అన్నారు.