నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు..

asmble-22.jpg

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అయితే నేడు పదవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు శాసన సభ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నేడు అసెంబ్లీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ‘రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం సాగించిన విధ్వంసం, కూటమి ప్రభుత్వంలో రాజధాని పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలు’ అనే అంశంపై నేడు సభలో చర్చ జరగనుంది. అనంతరం 2047-విజన్ డాక్యుమెంట్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన రిలీజ్ చేయనున్నారు. వరదలు, రుషికొండ ప్యాలెస్ తదితర అంశాలపైనా చర్చిస్తారని సమాచారం.

Share this post

scroll to top