సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన వీడియోలో దర్శనమిస్తున్నాయి. సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తూ వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా, పూనమ్ ట్విట్టర్ వేదికగా ఓ సంచలన ట్వీట్ చేసింది. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకుడు బయటకు రాకుండా ప్రజల వద్ద లేకపోతే ఎలా. కేవలం మాటల నాయకుడు చేతల నాయకుడు కాదని అంటారు. అలాంటి లీడర్ అవకాశవాది అవుతాడు అని రాసుకొచ్చింది. ప్రజెంట్ పూనమ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పవన్ గురించే పెట్టిందని చర్చించుకుంటున్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం నువ్వొక ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ నీకేం పని లేదా? అని కౌంటర్లు వేస్తున్నారు. అలాగే ఈరోజు మా డిప్యూటీ సీఎం ప్రజల్లో పర్యటించడంతో పాటు కోటి రూపాయలు విరాళం అందించారు అని పోస్టులు పెడుతున్నారు.
ఈ సమయంలో నాయకుడు ప్రజల వద్ద లేకపోతే ఎలా..
