ప్రేమోన్మాది చేతిలో బాలిక బలి..

karnool-19.jpg

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో అశ్విని అనే ఇంటర్ విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి ప్రేమోన్మాది చేతిలో బాలిక బలైంది. చిన్న పత్తికొండ మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అశ్విని దసరా సెలవుల్లో ఇంటికి వచ్చింది. ప్రేమించకపోతే చంపేస్తానని చిన్న వీరేశ్ సదరు బాలికను బెదిరించారు. ఇక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ బాలిక ప్రతిఘటించడంతో బలవంతంగా పురుగుమందు తాగించాడు.

అయితే, పెనుగులాటలో వీరేశ్ కు కూడా గాయాలయ్యాయి. ఇక, పొలం పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చావు బతుకుల్లో కనిపించిన అశ్వినిని చూసి షాక్‌ తిన్నారు. వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అశ్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రేమ పేరుతో తన కూతురు వేధింపులకు గురి చేసి అత్యాచార యత్నం చేసి ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Share this post

scroll to top