ఎన్నికల ఫలితాల తర్వాత ఆరా మస్తాన్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన వంద రోజుల పూర్తయిన తర్వాత మరోసారి మస్తాన్ యాక్టివ్ అయ్యారు.దేశవ్యాప్తంగా జెమిలి ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆరా మస్తాన్ మరోసారి రాజకీయ చర్చ జరిపేందుకు సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా మస్తాన్ స్పందించారు. పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ 20ని అధికారిక వెబ్ సైట్‌లో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత 48 గంటల్లోనే ఈ ఫామ్ అధికారిక వెబ్ సైట్‌లో ఉంచాలని మస్తాన్ తెలిపారు. కానీ వంద రోజులు పూర్తయిన తర్వత దాన్ని ఎందుకు అధికారికంగా అప్ లోడ్ చేశారని ఆరా మస్తాన్ ప్రశ్నించారు. తన ప్రశ్నకు వెంటనే ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని ఆరా మస్తాన్ కోరుతున్నారు.అయితే ఎన్నికల తతంగం ముగిసిన 100 రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఫలితాల గురించి ఆరా మస్తాన్ మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఆరా మస్తాన్ ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇస్తుందో లేదో చూడాలి.