ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ..

ntr-12-.jpg

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ చిత్రం వార్ 2. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.యంగ్ టైగర్ వార్ 2 నటిస్తున్న మొదటి స్ట్రెయిట్‌ హిందీ మూవీ కావడంతో ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లుజల్లింది.

తెలిసిన సమాచారం ప్రకారం వార్ 2 అనుకున్న సమయం కన్నా ఇంకా ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, గతకొద్ది రోజులుగా ముంబై లో ఎన్టీఆర్- హృతిక్ పై భారీ సెట్టింగ్ వేసి ఒక పాటను తీస్తున్నారు. ఈ ఒక్క పాటలో 500 మందికి పైగా డాన్సర్లు దీనిలో పాల్గొంటున్నారు. కాగా, ఈ పాట షూటింగ్ చేసే సమయంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో, డాక్టర్స్ ఆయనను 40 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Share this post

scroll to top