జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఎంఐఎం ఎమ్మెల్యే బూతు పురాణం..

ghmc-.jpg

మజ్లీస్ పార్టీకి చెందిన బహదూర్ పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ రెచ్చిపోయారు. ఓ ప్రార్థన మందిరం సమీపంలో రోడ్డు పనుల పెండింగ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై గరం గరం అయ్యారు. పెండింగ్ పనుల దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే.. అక్కడి పరిస్థితిని సమీక్షించి.. జీహెచ్ఎంసీ సిబ్బందిపై బూతు పురాణంతో రెచ్చిపోయాడు. వెంటనే ఈ ప్రార్థన సమీపంలోని రోడ్డు పనులను పూర్తి చేయకపోతే.. మీ సంగతి చూస్తానంటూ బల్దియా సిబ్బందిపై ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ దుర్భాషలాడారు. ఇంకా ఎన్నాళ్లు రోడ్డు పనులు చేస్తారంటూ ప్రశ్నించారు. తనతో పెట్టుకోవద్దు.. పనులు ఎంత వరకు జరిగాయో కూడా అధికారి వచ్చి చూసే తీరిక లేదా అంటూ జీహెచ్ఎంసీ సిబ్బందిని నిలదీశారు. తానెంత మంచివాడనో అంతే చెడ్డవాడిని అంటూ బల్దీయ సిబ్బందిని హెచ్చరించారు. దీంతో బహదూర్ పుర ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ మాట్లాడిని ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share this post

scroll to top