నందమూరి బాలయ్య ఒకవైపు వరుస సినిమాలు, టాక్ షోస్ తో హల్ చల్ చేస్తున్నాడు. బాలయ్య ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇటీవల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. కాగా బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎంతగానో ఎదురు చూస్తోంది. ఒకపక్క మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం స్టార్ హీరోగా ఎదగడం చకచక జరిగాయి. మరొక స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. దీంతో బాలయ్య కొడుకు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చాలా కాలంగా చర్చ నడిచింది. వాస్తవానికి నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఇన్నాళ్లకు బాలయ్య వారసుడు ఎంట్రీ ఫిక్స్ అయింది.
టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న మోక్షజ్ఞ..
