రేవంత్ ప్రభుత్వంలో నిరుద్యోగులపై దమన కాండ నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. యూనివర్సిటీ హాస్టళ్లల్లో కరెంటు కూడా తీసేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ , బీసీ మంత్రులకు అధికారులకు అడుగడుగునా అవమానం జరుగుతోందని చెప్పారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో బాల్కసుమన్ మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రి గుడిలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి అవమానం జరిగిందని, నిన్న బల్కం పేట ఎల్లమ్మ గుడిలో పొన్నం ప్రభాకర్‌కు అవమానం జరిగిందని అన్నారు. దళిత ఎస్ ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ ప్రభుత్వంలో నిరుద్యోగులపై దమన కాండ..
