అల్లుడి కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ బాధితులకోసం బీజేపీ నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ లండన్, సీయోల్ కాదు మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్ అన్నారు. సబర్మతి, నమామి గంగతో మూసీకి పోలికా? అని ప్రశ్నించారు. సబర్మతి, నమామి ఖర్చు కు, మూసి అంచనాకు పోలిక ఎక్కడ? అని మండిపడ్డారు. మీ అల్లుడి కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా మీకు అండగా ఉంటామన్నారు.
అల్లుడి కోసమే మూసీ డ్రామా..
