హైదరాబాద్‌లో కొత్త కల్చర్ మొదలైంది. బంజారాహిల్స్‌లోని పలు పబ్‌లలో యువతుల చేత అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. పక్కార్ సమాచారంతో శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. TOS పబ్‌లో యువతుల అశ్లీల నృత్యాలు చూసి ఖంగుతిన్నారు. పబ్‌లకు వచ్చే కస్టమర్లకు యువతులతో వల వేసి అధిక బిల్లు అయ్యేలా నిర్వహకులు ప్లాన్ విచారణలో తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు 149 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 42 మంది యువతులు, ఏడుగురు నిర్వహకులు, 100 మందికిపైగా కస్టమర్లు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.