బిగ్ బాస్ ఇస్తున్న చివరి ఛాలెంజ్ రంగు పడుద్ది. ఈ ఛాలెంజ్ లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా మీ ప్రత్యర్థి టీ షర్టు పైన ఎక్కువ రంగు ఉండేలా చూసుకోవడం అంటూ టాస్క్ ప్రారంభించారు బిగ్ బాస్ . ఇక నిఖిల్ మరియు గౌతమ్ ఇద్దరూ కూడా తమకు ఇచ్చిన వైట్ కలర్ టీ షర్ట్ ధరించి తమ చేతులతో రంగు పులుముకొని ప్రత్యర్థి టీ షర్ట్ పై పూసే ప్రయత్నం చేశారు. అయితే ఈ టాస్క్ లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముందుగా నిఖిల్ గౌతమ్ ను కావాలని కొట్టి ఆయన కాలు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళాడు.
కానీ చివర్లో మాత్రం తాను తప్పు చేయలేదన్నట్టు బిహేవ్ చేశాడు. నిఖిల్ ఎందుకు నన్ను కొట్టావు అంటూ గౌతమ్ ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ గౌతమ్ నేను రంగు రాయబోతుంటే నీకు అలా అనిపించింది అని అడగ్గా నువ్వు ప్రతిదీ అలాగే చెబుతావు అంటూ ఇక్కడ గౌతమ్ పై నెగెటివిటీ క్రియేట్ చేసేలా చేశాడు. మచ్చా నువ్వు కింద పడేసి ఈడ్చుకుంటూ వెళ్లావు కదా అది గుర్తులేదా అంటే నిఖిల్ మాత్రం పక్కకెళ్ళి కూర్చో బే అంటూ కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడాడు. దీంతో కోపం తెచ్చుకున్న గౌతం నిఖిల్ పై ఫైర్ అయ్యాడు. గేమ్లో కావాలని కొట్టావని నిఖిల్ అన్నాడు. అప్పుడు గౌతమ్ ఎవరైనా కావాలని కొడతారా అంటే ఎవరికి తెలుసు నువ్వు కొట్టినా కొడతావ్ అంటూ నిఖిల్ మళ్లీ గౌతమ్ పై విరుచుకుపడ్డాడు. మధ్యలో ప్రేరణ కలగజేసుకుంది. గౌతమ్ ను ఆపే ప్రయత్నం చేసింది. కానీ ఇది నా పర్సనల్ విషయం అంటూ ప్రేరణపై ఫైర్ అయ్యాడు గౌతమ్. నెటిజన్స్ కూడా మధ్యలో నీ పెత్తనం ఏంటి అంటూ ప్రేరణపై కూడా ఫైర్ అవుతున్నారు.