నువ్వుల నూనెతో బెనిఫిట్స్..

oil-17.jpg

నువ్వుల నూనెను చర్మానికి మర్దనా చేసుకోవడం వల్ల యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. నువ్వుల నూనెతో ముఖానికి, కాళ్లు, చేతులకు రాసుకుని మాసాజ్ చేసుకుంటే మృత కణాలు తొలగిపోతాయి. రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. నువ్వుల నూనెను మీ ముఖానికి క్రమం తప్పకుండా వాడటం వలన మీ చర్మం బిగుతుగా, ప్రకాశవంతంగా మారుతుంది.  నువ్వుల నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల  చర్మానికి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. నువ్వుల నూనె సహజ తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పొడిబారిన, నిస్తేజమైన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు, నువ్వుల నూనెతో మీ ముఖాన్ని తేలికగా మసాజ్ చేసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి.

నువ్వుల నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. అర కప్పు నువ్వుల నూనె, అర కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్, పావు కప్పు నీరు కలిపి ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దీన్ని మీ ముఖంపై అప్లై చేయండి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా చర్మం బిగుతుగా, మృదువుగా మరియు అందంగా మారుతుంది. ఒక చెంచా నువ్వుల పొడిలో పాలు లేదా తేనె కలిపి ముఖాన్ని స్క్రబ్ చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. అంతేకాదు నువ్వుల నూనె పెదవులను తేమగా ఉంచుతుంది. పెదవుల నల్లదనాన్ని తగ్గించడం ద్వారా వాటిని గులాబీ రంగులోకి మార్చేలా సహాయపడుతుంది. నువ్వుల నూనె కంటే మెరుగైన సన్‌స్క్రీన్ మరొకటి ఉండదు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది.

Share this post

scroll to top