విశాఖపట్నంలో బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ కలకలం రేపుతున్నాయి. నగరంలో పలు చోట్ల పుట్టగొడుగుల్లా బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ వెలిశాయి. ఎక్కడకక్కడ భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ వైపు బెట్టింగ్ యాప్స్ పై కొరడా ఝలిపిస్తుంటే విశాఖపట్నంలో మాత్రం ఇందుకు భిన్నంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. 1XBET, ZUPLAY పేరుతో విశాఖలో భారీగా హోర్డింగ్స్ పెట్టారు. బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ పెట్టడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనను విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ భ్రత బాగ్చి దృష్టికి నగర వాసులు తీసుకెళ్లగా దీనిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు పోతామని ఆయన హామీ ఇచ్చారు.
విశాఖలో బెట్టింగ్ యాప్స్ హోర్డింగ్స్ కలకలం..
