ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన లింగావత్ రక్షిత ఐదు రోజుల క్రితమే కళాశాలలోని వసతి గృహంలో చేరింది. అయితే రక్షిత శుక్రవారం రాత్రి హాస్టల్లోని బాత్ రూం లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ జయేష్ రెడ్డి, ఎస్సై సాయన్న ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా ఐదు రోజుల క్రితమే హాస్టల్‌లో చేరిన రక్షితకు ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవాల్సినంత బలమైన కారణం ఏమై ఉంటుందనేది అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతురాలి బంధువులు, హాస్టల్‌లోని ఇతర విద్యార్థినులు, ఇంచార్జి, సిబ్బందిని విచారిస్తూ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఓ విద్యార్థిని ఆత్మహత్య..
