తెలంగాణలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల జోరు నడుస్తోంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అయితే తాజాగా మహిళల విషయంలో ప్రభుత్వం వెనకడుగేసిందని తెలుస్తోంది. తామిచ్చిన 6 గ్యారెంటీల అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఓ కీలక విషయం వైరల్ అవుతోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు జరగలేదు. ఈ బడ్జెట్ల లోనే మహిళలందరికీ 2500 పెన్షన్ పై కీలక ప్రకటన వస్తుందని అంతా భావించారు. కానీ నిరాశే ఎదురైంది. ఈ పరిస్థితుల నడుమ ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఓ కీలక విషయం వైరల్ అవుతోంది..
