టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటేజ్ మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు, రాజమౌళి సినిమానే. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారన్న వార్త రావడంతో భారీగా అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పాట్లను వెతికే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న నేపథ్యంలో హీరోయిన్ గా దాదాపు ప్రియాంక చోప్రా ఫైనల్ అయ్యారు. మరో ఇద్దరు భామలు కూడా ఇందులో నటించే ఛాన్సులు ఉన్నాయని చెబుతున్నారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ కావడానికి ఏం లేదన్నా మూడు సంవత్సరాలు పట్టి ఛాన్స్ ఉంది. రాజమౌళితో సినిమా అంటే అలాగే ఉంటుంది.
వేరే సినిమాలన్నీ పక్కకు పెట్టి కేవలం రాజమౌళి సినిమానే చేయాల్సి ఉంటుంది. అన్నిటికీ తెగించే రాజమౌళి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్ బాబు. ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ రూమర్ వైరల్ అవుతుంది. మహేష్ బాబు అలాగే రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతుందట. షూటింగ్ ప్రారంభమైన తర్వాతే గ్యాప్ లేకుండా త్వరితగతిన ఈ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.