బిగ్ బాస్ 8 గ్రాండ్ గా ప్రారంభమై.. అప్పుడే వారం రోజులు కూడా కంప్లీట్ చేసుంది. ఇక తొలి వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. బిగ్ బాస్ 8 తొలి వారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. అందరూ ఊహించినట్లుగానే బెజవాడ బేబక్క ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయ్యింది. మెుదటి వారం నామినేషన్స్ లిస్ట్ లో బెజవాడ బేబక్క, యాంకర్ విష్ణు ప్రియ, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల ఉన్నారు. ఓటింగ్ లో వీళ్లందరి కంటే బేబక్కకు అతి తక్కువ ఓట్లు రావడంతో.. ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
ఈ సీజన్ నుంచి నిష్క్రమించిన తొలి కంటెస్టెంట్ గా కూడా నిలిచింది. బేబక్క తొలి వారంలోనే ఎలిమినేట్ కావడంతో.. ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక ఒక వారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న బేబక్క అందుకున్న పారితోషికం రూ. 1.30 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షోలోకి వెళ్లడం ద్వారా ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎక్కువ సమయం కిచెన్ లోనే ఉండి మిగతా కంటెస్టెంట్స్ కు వండి పెట్టింది. ఈ క్రమంలో బేబక్క ప్రేక్షకులకు వినోదాన్ని ఇవ్వడం మర్చిపోయింది. పైగా.. కుక్కర్ గొడవ ఆమెపై నెగిటివిటీని పెంచింది. టాస్క్ ల్లో, ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. అందుకే ఆమె ఎలిమినేట్ అయ్యిందని చెబుతున్నారు నెటిజన్లు.