ఓట్ అప్పీల్ అవకాశం గెలిచిన ప్రేరణను ఇన్ఫినిటీ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్. అందరికీ నమస్కారం నేను మీ ప్రేరణ బిగ్‌బాస్ జర్నీ నేను వస్తాను ఇక్కడ ఉంటాను అని నేను అనుకోలేదు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి జస్ట్ ఏడాదిన్నర అయింది అంతే తెలుగు ఆడియన్స్ నుంచి చాలా లవ్, సపోర్ట్ వచ్చింది. నాకు బిగ్‌బాస్ కాన్సెప్ట్ అంటేనేచాలా ఇష్టం. ఇక్కడ మనలాగా ఉండొచ్చు కానీ ఆ గేమ్స్, ఎంటైర్ కాన్సెప్ట్ ఒక ఇంట్లో ఉండి ఫోన్ లేకుండా ఎలాంటి డిస్ట్రేక్షన్ లేకుండా ఎలా సర్వైవ్ అవుతాను అనే పాయింట్ నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇక్కడికి వచ్చాను నాలాగ ఉండాలి అనుకున్నాను ఉంటున్నాను. ఖచ్చితంగా కొన్నిసార్లు తప్పు చేశాను. ఎవరు పర్ఫెక్ట్‌గా ఉండరు నేను తప్పులు చేశాను వాటిని ఎవరు చెప్పినా వాటి నుంచి నేర్చుకుంటున్నాను అంటూ ప్రేరణ అంది.
నా గురించి నాకే కొన్ని మంచి విషయాలు కొన్ని బ్యాడ్ విషయాలు తెలిశాయి. ఆ బ్యాడ్ విషయాలు నేను సరిచేసుకుంటే నా లైఫే చాలా బావుంటుంది. ఇప్పటిదాకా 13 వారాలు నేను సేవ్ అయ్యాను నా ఆడియన్స్ సపోర్ట్ వల్లే ప్లీజ్ చాలా దగ్గరిలో ఉన్నా ఫైనల్స్‌కి ఇలా మీ సపోర్ట్ మీ లవ్ ఓట్స్ నాకు కావాలి ఇప్పుడు ఒక్క నామినేషన్ ఉంది. అది దాటేస్తే ఇక ఫైనల్స్ ఆ విన్నర్‌కి చాలా దగ్గరిలో ఉన్నాను. మీ సపోర్ట్ మీ ఓట్స్ నాకు ఇవ్వండి మీందరూ గర్వపడేలా చేస్తాను. బిగ్‌బాస్ సీజన్ 8 బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అవ్వాలని గట్టిగా ఆశ ఉంది. అది మీ సపోర్ట్ వల్లే అవుతుంది. నాకు సపోర్ట్ చేయండి ఓట్ చేయండి మీ ప్రేమ ఇవ్వండి. నేను కూడా నా బెస్ట్ ఇస్తా ఓటు మీది గెలుపు నాది నేను ఫన్‌గా నాలాగా క్రేజీగా ఉంటా ఈ టూ వీక్స్ ఎంజాయ్ చేద్దాం ఓట్ చేయండి ప్లీజ్ అంటూ ప్రేరణ రిక్వెస్ట్ చేసింది.