బిగ్బాస్ సీజన్ 8లో చివరి వారం ఓటింగ్ నడుస్తుంది. డిసెంబర్ 15న ఈ షో గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్లను అలరించడానికి అటు సీరియల్ బ్యాచ్ మొత్తం బిగ్బాస్ షోలో సందడి చేస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో మామగారు సీరియల్ నుంచి ఆకర్ష్, సుహాసిని ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరు నిఖిల్, అవినాష్ లకు మంచి ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత హౌస్మేట్స్ అందరి ఫస్ట్ లవ్, బ్రేకప్ స్టోరీలు చెప్పాలంటూ కోరారు. ముందుగా గౌతమ్ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చాడు. కాలేజీలో ఉన్నప్పుడే తనకు ఫస్ట్ మేజర్ రిలేషన్ షిప్ నడిచిందని చెప్పుకొచ్చాడు. చాలా సీరియల్ రిలేషన్ షిప్ లో ఉండి పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాడట. తనంటే ఎంతో ఇష్టం ఎంతో ప్రేమ ఉండేదని కానీ చాలా రీజన్స్ వల్ల అది జరగలేదని దీంతో చాలా బాధపడ్డానని అదే బాధతో డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత నిఖిల్ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. తనకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు చాలా డిప్రెషన్ లోకి వెళ్లానని ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రావడం తన ఫస్ట్ సినిమా పోస్టర్ తన ఊరిలో అదే కాలేజీ పక్కన థియేటర్ బయట కటౌట్ పడిందని అన్నాడు. అది చూసి తను ఏ రీజన్ కు అయితే నన్ను వదిలేసిందో అదే కారణానికి సారీ చెప్పి నా దగ్గరికి వచ్చిందని కానీ అప్పటికే తనను బ్లాక్ చేశానని అన్నాడు. రాంగ్ నంబర్ అని బ్లాక్ చేశానని తన ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. మనల్ని వదిలేసి వెళ్లిపోయారే మనకేంటి అని కాదు. మనకు ఏం రీజన్ చెప్పారనేది ముఖ్యం. నాకు ఫ్యూచర్ లో దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి కూడా కొంతమంది బ్రేకప్ చెప్పి వెళ్తారు అంటూ నిఖిల్ చెప్పాడు.