బిగ్ బాస్‌లో మెగా చీఫ్ అవ్వడానికి హౌస్ మేట్స్ కు టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక మెగా చీఫ్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో నిన్నటి ఎపిసోడ్ లో ప్రేరణ అవినాష్ ను టార్గెట్ చేసి బ్యాగ్ లోని బాల్స్ ను పడేసే ప్రయత్నం చేసింది. అవినాష్‌ను అవుట్ చేద్దాం అని గట్టిగానే ప్రయత్నిచింది. కానీ అవినాష్ తెలివిగా ఆమె బ్యాగ్ ను దాదాపు ఖాళీ చేశాడు. దాంతో బజార్ మోగడంతో ప్రేరణ అవుట్ అయ్యింది. ఆతర్వాత నబీల్ , అవినాష్ మాట్లాడుకున్నారు. ఇద్దరం కలిసి నిఖిల్ ను టార్గెట్ చేద్దాం అని అవినాష్ అనగానే నబీల్ ఒప్పుకున్నాడు. నువ్వు చీఫ్ అవ్వు కావాలంటే నేను ఓడిపోతాను కానీ నిఖిల్ ను టార్గెట్ చేద్దాం అని అన్నాడు నబీల్ .
ఇక బజార్ మోగగానే నిఖిల్ ను టార్గెట్ చేశారు అవినాష్, నబీల్. కానీ నిఖిల్ ఈ ఇద్దరినీ చాలాసేపు మ్యానేజ్ చేశాడు. ఈ క్రమంలోనే నిఖిల్ చూసుకోకుండా చెయ్యి విసరడంతో అవినాష్ కు గట్టిగానే తగిలింది. ఆతర్వాత గేమ్ తిరిగి స్టార్ట్ చేశాడు. ఈసారి నిఖిల్ పై గట్టిగా టార్గెట్ చేశారు అవినాష్, నబీల్ దాంతో నిఖిల్ బాల్స్ తక్కువ అయ్యాయి. దాంతో అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నబీల్ నేను అవుట్ అయ్యిపోతాను నువ్వు విన్నర్ అవ్వు అని అవినాష్ కు చెప్పాడు. కానీ వొద్దు నువ్వు ఆడు అన్నాడు. కానీ నబీల్ వినలేదు. నేను ఒక్కసారి చీఫ్ అయ్యాను కదా నువ్వు రెండు వారాల నుంచి ట్రై చేస్తున్నావ్ అని నబీల్ అన్నాడు. ఇక బజార్ మోగగానే ఎదో ఆడాలి అన్నాడు ఆడాడు నబీల్. ఫైనల్ గా అవినాష్ విన్నర్ గా నిలిచాడు. హరితేజ, యష్మీ, నిఖిల్, పృథ్వీ అందరూ ఏమైందిరా ఎందుకు ఇచ్చేశావ్ అని అడిగితే నా స్టామినా అయిపొయింది అని కవర్ చేశాడు నబీల్. కానీ నిఖిల్ మాత్రం అబద్దాలు చెప్పకు నీ గురించి మాకు తెలుసు అని కౌంటర్ వేశాడు.