హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హరితేజ..

hari-teja-11.jpg

బిగ్ బాస్ సీజన్ 8లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అనారోగ్య సమస్యలతో గంగవ్వ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అలాగే నిన్న ఆదివారం అవ్వడంతో హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించారు. ఇలా ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయ్యింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగ్. చివరికి యష్మీ-హరితేజ వీరిలో హరితేజ ఎలిమినేట్ అయ్యింది. బయటకు వస్తూ హరితేజ తన రాయల్స్ క్లాన్ వాళ్లను హగ్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. మీ అందరిని మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యాయంది హరితేజ.

అలాగే విష్ణు ప్రియా కూడా హరితేజ బయటకు రాగానే విష్ణుప్రియ కూడా ఎమోషనల్ అయింది. అలాగే హరితేజాతో పాటు గేట్ వరకు వెళ్లిన నిఖిల్ నిన్ను చాలా మిస్ అవుతా అంటూ డైలాగ్ కొట్టాడు. దానికి నువ్వు నన్ను ముందు అనుమానించావ్ కదా అని అంది హరితేజ. ఆతర్వాత స్టేజ్ పైకి వచ్చిన హరితేజాకు తన జర్నీ చూపించారు నాగ్. తాజాగా జర్నీ చూసి ఆనందించింది హరితేజ. అలాగే ఆ జర్నీలో చివరిగా తన కూతురు వీడియో ప్లే చేశారు. దాంతో మరోసారి హరితేజ ఎమోషనల్ అయ్యింది.

Share this post

scroll to top