బిగ్‌బాస్‌ నుంచి క్రై బేబీ ఎలిమినేట్..

nayani-04.jpg

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ రియాల్టీషో ఇప్పుడు పదో వారంలోకి అడుగు పెట్టింది. ఈ 9 వారాల్లో ఏకంగా 10 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, నైనిక, కిర్రాక్ సీత, మణికంఠ, మెహబూబ్ దిల్ సే ఇప్పటికే ఎలిమినేట్ కాగా రీసెంట్ గా క్రై బేబీ నయని పావని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్ అందరూ ఊహించిందే.

ఈ గత వారమే నయని ఎలిమినేట్ అవ్వాల్సింది. అయితే త్రుటితో తప్పించుకుంది. ఆమె స్థానంలో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. కానీ ఈ వారం ఎలిమినేషన్ నుంచి నయని తప్పించుకోలేకపోయింది. నయని గత సీజన్‌లోనూ వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు కేవలం వారం మాత్రమే ఉండి ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఈ అమ్మడిపై సింపతీ బాగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఈ సీజన్‌లో ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలనుకుని మళ్లీ హౌస్ లోకి అడుగు పెట్టింది. ప్రారంభంలో ఆటపై బాగానే దృష్టి పెట్టింది. తన మాటతీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేసింది.

Share this post

scroll to top