ఈవారం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ప్రతి ఇంటి సభ్యుడు ఇంట్లో ఉండటానికి అర్హతలేని ఇద్దరి సభ్యుల దిష్టి బొమ్మల మీద కుండలు పెట్టి కారణాలు చెప్పి వాటిని పగలగొట్టాల్సి ఉంటుంది. మెగా చీఫ్ కారణంగా గౌతమ్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. గౌతమ్ ఈ ఇంట్లో ఒక నామినేషన్ షీల్డ్ ఉంది. ఆ నామినేషన్ షీల్డ్ ను నచ్చినవారికి ఇవ్వండి. అది ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ సభ్యుడిని ఈవారం నామినేట్ చేసి ప్రతిసారి రూ.50 వేల విన్నర్స్ ప్రైజ్ మనీ నుంచి డిడక్ట్ అవుతాయని చెప్పాడు బిగ్‌బాస్.
దీంతో ఆ షీల్డ్ హరితేజకు ఇవ్వడంతో నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యింది హరితేజ. లాస్ట్ వీక్ తేజకు బదలుగా పృథ్వీని నామినేట్ చేయడం నచ్చలేదని పరొక్షంగా చెబుతూనే ప్రేరణను నామినేట్ చేసింది విష్ణు. ఇక ఇప్పటికే ప్రేరణను టార్గెట్ చేసిన పృథ్వీ ఈసారి రివేంజ్ నామినేషన్ చేశాడు. కొంపలు మునిగాక రావడం మానేయాలంటూ ప్రేరణను నామినేట్ చేసింది హరితేజ. ఈ వారం నామినేషన్లలో పృథ్వీ వర్సెస్ ప్రేరణ మధ్య పెద్ద గొడవే జరిగింది.