కాంతార టీంకు చీఫ్ గా ఎన్నిక..

seetha-25-.jpg

బిగ్‌బాస్ హౌస్ లో కాంతార టీంకు చీఫ్ గా ఎన్నిక జరిగింది. రెండో చీఫ్ ను ఎంచుకునేందుకు నిఖిల్ మినహా ప్రతి ఒక్కరు పోటిపడవచ్చు అని చెప్పాడు బిగ్‌బాస్ . టేబుల్ పై పది మంది బొమ్మలను పెట్టి వాటి ముందు సుత్తి పెట్టాడు. ముందుగా నిఖిల్ చీఫ్ కాబట్టి ఇందులో ఎవరు చీఫ్ గా అనర్హులని భావిస్తే ఆ మొదటి సభ్యుడి బొమ్మను పగలగొట్టాలని చెప్పాడు. రేసు నుంచి తప్పుకున్నవారు కూడా ఈసారి బజర్ మోగినప్పుడు నిఖిల్ తోపాటు సుత్తి కోసం పోటీపడాలి. ఆ సుత్తి వేరే సభ్యుడికి ఇవ్వాలని చెప్పాడు. ముందుగా నిఖిల్ ఆదిత్య బొమ్మను పగలగొట్టాడు. ఆ తర్వాత ఆదిత్య సుత్తి దక్కించుకుని పృథ్వీకి ఇవ్వడంతో మణికంఠను రేసు నుంచి తప్పించాడు. ఆ తర్వాత నిఖిల్ సుత్తిని దక్కించుకుని సీత చేతికి ఇచ్చాడు. దీంతో ఆమె యష్మీ బొమ్మను పగలగొట్టింది. ఆ తర్వాత మరోసారి నిఖిల్ చేతికే సుత్తి రాగా.. ఈసారి సోనియాకు ఇవ్వడంతో నబీల్ బొమ్మ పగలగొట్టి రివేంజ్ తీర్చుకుంది.

మరోసారి నిఖిల్ చేతికి సుత్తి రాగా ఈసారి నైనికకు ఇవ్వడంతో విష్ణుప్రియను రేసు నుంచి తప్పించింది. ఇక తర్వాత సుత్తి కోసం అందరూ ట్రై చేశారు. నిఖిల్, విష్ణుప్రియ ఒకే టైంలో సుత్తిని పట్టుకోగా మొదటగా విష్ణు పట్టుకుందని కాంతార టీమ్. కాదు నిఖిల్ అంటూ సోనియా వాదించారు. ఇద్దరు సుత్తిని లాక్కొవడానికి ట్రై చేయగా విష్ణుకు సపోర్ట్ గా నబీల్, మణికంఠ, యష్మీ వచ్చారు. దీంతో విష్ణు చేతికి సుత్తి రాగా ప్రేరణకు ఇచ్చింది. ఇక సోనియాను రేసు నుంచి తప్పించింది ప్రేరణ. ఆ తర్వాత మణికంఠ చేతికి సుత్తి రాగా నైనికకు ఇవ్వడంతో పృథ్వీ బొమ్మ పగలగొట్టింది. ఆ తర్వాత పృథ్వీకి సుత్తి దక్కించుకోవడంతో సీతకు ఇచ్చాడు. దీంతో నైనికను ఔట్ చేసింది. చివరగా సీత, ప్రేరణ మిగలడంతో ఈసారి నైనికకు సుత్తి ఇచ్చాడు. ఆమె ప్రేరణను తప్పించింది. దీంతో సెకండ్ చీఫ్ గా సీత నిలిచింది. ఆ తర్వాత సీత మాట్లాడుతూ నిఖిల్ కేవలం పృథ్వీ, సోనియా ఇద్దరి కోసమే ఆడుతున్నాడని నిఖిల్ వాయిస్ సచ్చిపోయిందని చెప్పేసింది.

Share this post

scroll to top