వరుసగా సీరియల్ బ్యాచ్ ప్రమోషన్స్..

bigg-boss-12.jpg

బిగ్‌బాస్ సీజన్ 8 శుభం కార్డ్ పడేందుకు రెడీ అయ్యింది. ఇంకా కొన్ని రోజుల్లో ఈ షో క్లైమాక్స్ కు చేరుకోనుంది. ఫినాలేకు ఉన్నది నాలుగు రోజులే అయినా ఇప్పటికీ టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీ వీడియోస్ చూపించకుండా వరుసగా సీరియల్ బ్యాచ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా సీరియల్ టీం యాక్టర్స్ వస్తూ ఇంట్లో సందడి చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అవినాష్, నబీల్ కలిసి పాలకూర బజ్జీలు చేశారు. వాటిని ఒక కప్పులో వేసి బిగ్‌బాస్ కు పంపించారు. స్టోర్ రూంలో వాళ్లిద్దరూ పెట్టిన బజ్జీలు తినేసి తక్కువ పంపించారంటూ ఓ లేఖ పంపించాడు. దీంతో మరికొన్ని బజ్జీలు చేసి పంపించారు నబీల్, అవినాష్. అవి కూడా సరిపోలేదంటూ చిటీ పంపించాడు. ఇక బిగ్‌బాస్ పంపించిన చిటీ కెమెరాకు చూపిస్తూ అవినాష్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయి. ఆ తర్వాత హౌస్ లోకి వంటలక్క సీరియల్ బ్యాచ్ వచ్చింది. ఇక్కడ అవినాష్ కామెడీతో అదరగొట్టాడు.

Share this post

scroll to top