ఫ్యామిలీ వీక్ కావండతో కంటెస్టెంట్లు అందకూ కాస్త ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా యష్మీ తండ్రి అయితే తన కూతురికి చాలా మంచి మాటలు చెప్పారు. హౌస్‌లో నీ బిహేవియర్ కారణంగా బయట చాలా నెగెటివ్ అవుతున్నావ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ముందు వారాల్లో ఎలా అయితే నీ కోసం ఆడావో అలా ఆడు ఇక గ్రూప్ గేమ్ వద్దు అంటూ కూడా సలహా ఇచ్చారు. అలానే హౌస్‌లో నడుస్తున్న నిఖిల్ యష్మీ లవ్ ఎఫైర్‌పై కూడా ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు. ఈ మాటలు యష్మీకి ఎంతవరకూ అర్థమయ్యాయో తెలీదు కానీ ఆడియన్స్‌కి మాత్రం క్లారిటీగా అర్థమయ్యాయి. మరోవైపు అవినాష్ భార్య రాకతో హౌస్‌లో అందరూ తెగ నవ్వుకున్నారు.
కట్ చేస్తే మీరంతా నీరసంగా కనిపిస్తున్నారు వెళ్లి ఒక గంట పడుకోండి అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో దొరికిందే ఛాన్స్ అనుకొని అందరూ పక్కేసేశారు. ఇంతలో సైలెంట్‌గా అవినాష్ భార్య అనూజ ఎంట్రీ ఇచ్చింది. డైరెక్ట్‌గా అవినాష్ పక్కకెళ్లి పడుకుంది. అయితే ఎవరో సడెన్‌గా హగ్ చేసుకునే సరికి అవినాష్ ఉలిక్కిపడి లేచాడు. సడెన్‌గా హగ్ చేసుకుంటే ఎవరో అనుకున్నా అని అవినాష్ అంటే ఆశపడ్డావ్ కదా ఎవరనుకున్నవ్ అంటూ తేజ అడిగాడు. దీనికి బ్లాక్ డ్రెస్ కదా యష్మీ అనుకొని ఉంటాడు అంటూ రోహిణి ఆటపట్టించింది.
ఇక యాక్షన్ రూమ్‌లోకి వెళ్లగానే అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్, బెలూన్స్, లైటింగ్, మ్యూజిక్ అన్నీ సెట్ చేసి పెద్ద హడావిడే చేశాడు బిగ్‌బాస్. అక్కడ కాసేపు తన భార్యతో ముచ్చట్లు పెట్టి ఎమోషనల్ అయ్యాడు అవినాష్. ఇది నా లైఫ్‌లో ఇప్పటివరకూ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ అవినాష్ అన్నాడు. ఎక్కువ ఎమోషనల్ అవ్వకు అంటూ అను ఓదార్చింది, ఇంతలో లైట్స్ ఆఫ్ చేశాడు బిగ్‌బాస్. ఈ దెబ్బకి కంగారు పడిన అవినాష్ బిగ్‌బాస్ లైట్స్ ఆఫ్ చేశారు కానీ కెమెరాలో మీరు అలా చూస్తేనే ప్రాబ్లమ్ అంటూ జోకులు వేశాడు. మొత్తానికి అవినాష్‌కి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.