సోనియా ఆకుల రీఎంట్రీ.. 

nikil-18.jpg

నబీల్ తన ఎవిక్షన్ షీల్డ్ వాడటంతో అవినాష్ సేవ్ అయ్యాడు. అతను బతికిపోవడంతో తేజను పంపేస్తారని అంతా అనుకున్నారు. కానీ అవినాష్‌కి మించి ఓట్లు రావడంతో అతను కూడా ఈ వారం సేవ్ అయినట్లుగా నాగ్ ప్రకటించడంతో హౌస్‌లో సందడి నెలకొంది. అలా బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో తొలిసారి ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా వారం ముగిసింది. అయితే టేస్టీ తేజ కాకుండా యష్మి, అవినాష్ కనుక ఉండి ఉంటే ఎవిక్షన్ వాడేందుకు ఆలోచించేవాడినని నబీల్ తెలిపాడు.

ఇక ఎలిమినేషన్ ముగిసిన వెంటనే ఎప్పటి లాగే నామినేషన్స్‌కు శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. మెగా చీఫ్ అయిన కారణంగా అవినాష్‌ను ఎవరూ నామినేట్ చేయకూడదని చెప్పారు. అయితే గత సీజన్లకు భిన్నంగా ఈ వీక్ నామినేషన్స్ ప్లాన్ చేశాడు. బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారిని హౌస్‌లోకి తీసుకొచ్చి వారితో ఇద్దరేసి ఇంటి సభ్యులను నామినేట్ చేయాలని చెప్పాడు. ఆ వెంటనే డోర్స్ ఓపెన్ అవ్వగా ఎదురుగా సోనియా ఆకుల ప్రత్యక్షమైంది. వచ్చీ రావడంతోనే ప్రేరణ, నిఖిల్‌లను నామినేట్ చేసేసేంది. దీంతో కంటెస్టెంట్స్, ప్రేక్షకులు షాకయ్యారు. సోనియాతో పాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్‌లో తమ పాయింట్‌ని గట్టిగానే రైజ్ చేశారట.

ఇక 12వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారట. వారు రోహిణి, నబీల్, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీరాజ్, నిఖిల్, ప్రేరణ . మరి 12వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

Share this post

scroll to top