హౌస్ నుంచి బయటకు వచ్చేసిన పృథ్వీ..

bigg-boss-2.jpg

ఆదివారం వస్తే చాలు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక వీకెండ్ వస్తే బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున సందడి చేస్తున్నారు. ఇక నిన్నటి వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం రోజున తేజ ఎలిమినేట్ అయ్యాడు . ఇక ఆదివారం రోజున పృథ్వీ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న పృథ్వీ నిన్న ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ రౌండ్ లో చివరిగా విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరు మిగిలారు. వీరిలో విష్ణుప్రియ సేఫ్ అవ్వడంతో పృథ్వీ అవుట్ అయ్యాడు. ఇక విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయ్యింది.

ఆదివారం రోజున నాగార్జున హౌస్ మేట్స్ తో సరదాగా ఆటలు పాటలతో సందడి చేశారు. ఆతర్వాత ఎలిమినేషన్ లో ఉన్న పృథ్వీ విష్ణు యాక్షన్ రూమ్‌కి వచ్చేయండి అని నాగార్జున పిలిచారు. అక్కడ ఇద్దరి ముందు రెండు అక్వేరియంలు  పెట్టారు. అలాగే రెండు లిక్విడ్ బాటిల్స్ కూడా ఇచ్చారు. నెం 1 అని రాసిన లిక్విడ్ ని ఇద్దరూ తమ ముందు ఉన్నఅక్వేరియంలో వేయాలని చెప్పారు నాగ్. దాంతో ఆ వాటర్ ఎల్లో కలర్ లోకి మారిపోయాయి. ఇద్దరి అక్వేరియంలు ఎల్లో కలర్ లోకి మారిన తర్వాత మరో బాటిల్ అంటే నెం 2 అని రాసిన లిక్విడ్ ను అక్వేరియం వేయాలని ఎవరి అక్వేరియంలో వాటర్ రెడ్ కలర్ లో మారితే వారు ఎలిమినేట్ అని చెప్పారు నాగ్. దాంతో ఇద్దరు ఆ లిక్విడ్ పోయగా.. పృథ్వీ వాటర్ రెడ్ కాగా విష్ణు అక్వేరియంలో నీళ్లు ఎల్లోగా ఉండిపోయాయి. దాంతో పృథ్వీ ఎలిమినేట్ అంటూ ప్రకటించారు నాగార్జున.

Share this post

scroll to top