బిగ్‌బాస్ పదోవారం నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు. సోమవారం నాటి గేమ్‌లో గౌతమ్ అదరగొట్టాడు. ఈ ఎపిసోడ్ తో అతడు టైటిల్ ఫేవరేట్లలో ఒకరిగా మారిపోయాడు. యష్మి, నిఖిల్‌లకు గౌతమ్‌కు మధ్య సాగిన వాదనలు నామినేషన్స్ ఎపిసోడ్‌కు హైలైట్ గా నిలిచాయి.
ఇక నామినేషన్స్ ప్రక్రియ వాడీవేడిగా సాగింది. గౌతమ్, నిఖిల్ ల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరు నో అని అన్నప్పుడు నో అనే అర్థం. వద్దని చెప్పినా యష్మిని అక్కా అని పిలిచి ఇబ్బంది పెడుతున్నావు అంటూ గౌతమ్ ను నిఖిల్ నామినేట్ చేశాడు. యష్మిని అక్కా అని పిలిస్తే తప్పేంటి, ఆమె కూడా తనను తమ్ముడు అని పిలిచింది కదా అంటూ గౌతమ్ వాదించాడు. ఆ తరువాత యష్మిని గౌతమ్ నామినేట్ చేశాడు. మెగా చీఫ్ అయ్యాకా టీమ్ లోనుంచి తనను సైడ్ చేశాడవని అన్నాడు. దీంతో యష్మి అతడితో వాదనకు దిగింది.
అయితే బిగ్‌బాస్ ఓ చిన్నట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్‌లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేసి, సేవ్ అయిన వారిలో ఒకరిని నామినేట్ చేయాలని మెగా చీఫ్ అవినాష్ కు సూచించాడు. దీంతో అవినాష్ తన పవర్ ను ఉపయోగించి రోహిణిని సేవ్ చేసి నిఖిల్‌ను నామినేట్ చేశాడు.