అందరూ అనుకున్నట్టుగానే..

bigg-boss-30.jpg

బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ సీజన్ లో కొత్త మార్పులు చేసారు కానీ, అందరూ ఉహించినట్టుగా అంత హైప్ ను మాత్రం ఇవ్వలేకపోయింది. ఇప్పటి వరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక, ఆదివారం ఎపిసోడ్ లో ఆర్జీవీ భామ సోనియా ఎలిమినేట్ అయింది. ఈ ముద్దుగుమ్మ మొదటి నుంచి ఆడిందే లేదు.. ఇప్పటి వరకు ఈమె ఇంట్లో ఉండటమే గ్రేట్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాలుగో వారం నామినేషన్స్ లో ఉన్న వారిని సేవ్ చేసుకుంటూ చివరికి సోనియా, నాగ మణికంఠ ఉన్నారు. వీరిలో ఎవర్ని ఇంటి నుంచి బయటకు పంపించాలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నే చెప్పమని నాగార్జున అడిగాడు. నిఖిల్‌, పృథ్వీ, నైనిక సోనియాకు ఓట్ వేయగా మిగతా వాళ్ళు అంతా నాగ మణికంఠకు సపోర్ట్ చేసారు. దీంతో ఆర్జీవీ భామ ఎలిమినేట్ అయింది. అయితే, మణికంఠ కొన్ని రోజులు జైల్లో ఉండాలని చెప్పాడు నాగార్జున. అయితే, ఈ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

Share this post

scroll to top