బిగ్ బాస్ తెలుగు సీజన్-8 తుది అంకానికి చేరింది. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం రోహిణి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం తెలిసిందే. కాగా ఆదివారంనాడు మరో కంటెస్టెంట్ విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయ్యింది. డబుల్ ఎలిమినేష న్ ప్రక్రియ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. చివరకు అతి తక్కువ ఓట్లు వచ్చిన విష్ణుప్రియ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. డబుల్ ఎలిమినేషన్‌తో రోహిణి, విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్‌ను వీడారు. దీంతో ఈ సీజన్ టాప్-5లో నబీల్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్‌లు నిలిచారు. బిగ్‌బాస్ టైటిల్ పోరులో నిలిచిన ఈ ఐదుగురు ఫైనలిస్ట్స్ లో ఈ సీజన్ విన్నర్‌గా ఎవరు నిలుస్తారన్నది ఉత్కంఠరేపుతోంది.
హౌస్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్..
