నిఖిల్ vs యష్మీ..

bigg-6.jpg

సాధారణంగా నిఖిల్- యష్మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. యష్మీ డిసర్వ్ అని నిఖిల్ చీఫ్ ని కూడా చేశాడు. నిఖిల్ అభిప్రాయంతో నైనికా ఏకీభవించింది కాబట్టే ఆమె చీఫ్ అయ్యింది. అయితే కామన్ గా యష్మీ ఎప్పుడూ నిఖిల్ తో వాగ్వాదానికి దిగినట్లు కనిపించలేదు. వాళ్లిద్దరు హౌస్ లో బడీస్ కూడా. కానీ, ఈసారి తన క్లాన్ కోసం యష్మీ గొడవకు దిగింది. అసలు ఏం జరిగిందంటే క్లాన్స్ మధ్య జరుగుతున్న పోరులో రెండో పోటీ మొదలైంది. ఇందులో ఒకవైపు ఉన్న రింగ్స్ ని మరోవైపునకు తీసుకురావాలి. బిగ్ బాస్ హౌస్ లో ఏ ఆట అంత సింపుల్ గా ఉండదు కదా? క్లాన్ సభ్యులు ఒక చైన్ లా నిలబడి ఒకవైపు ఉన్న రింగ్స్ మరోవైపునకు వారి శరీరం మీదుగా తీసుకురావాలి చేతులు వదలకుండా.

ఆట మొదలైంది. నైనికా టీమ్ రింగ్స్ ని మెడ నుంచి చేతుల మీదుగా మరోవైపునకు తీసుకెళ్లారు. కానీ, యష్మీ టీమ్ మాత్రం ఆ రింగ్స్ ని శరీరం మొత్తం తిప్పి తీసుకెళ్లారు. ఈ ఆటలో నైనికా టీమ్ గెలిచింది అని నిఖిల్ ప్రకటిస్తాడు. అక్కడే అసలు గొడవ స్టార్ట్ అవుతుంది. అలా ఎలా చెప్తావ్ అంటూ నిఖిల్ మీద యష్మీ టీమ్ మాత్రమే కాదు యష్మీ కూడా ఫైర్ అవుతుంది. మేము రూల్స్ ప్రకారమే ఆడాం అంటూ నైనికా టీమ్ చెప్పుకుంది. ఇక్కడే నిఖిల్ కూడా తన వాదనను వినిపించాడు.

Share this post

scroll to top