ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్స్..

bigg-boss-18.jpg

7వ వారానికి గాను తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. నబీల్, నాగ మణికంఠ, ప్రేరణ, పృథ్వి, టేస్టీ తేజ, హరితేజ, గౌతమ్, నిఖిల్, యష్మి నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ గా ఉంటాయి. అంటే మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుంది. ఈ క్రమంలో ఎవరు ఎలిమినేట్ అవవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాజా ఓటింగ్ సరళి పరిశీలిస్తే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రేసులో వెనుకబడ్డారట. సోషల్ మీడియా స్టార్ నబీల్ అనూహ్యంగా టాప్ లో ట్రెండ్ అవుతున్నాడట.

అతడికి అత్యధికంగా ఓట్లు పోల్ అయ్యాయట. నబీల్ కి దాదాపు 21 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. చెప్పాలంటే నబీల్ కి పెద్దగా పాపులారిటీ లేదు. కేవలం గేమ్ ఆధారంగా అతడు ఓట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. నబీల్ తర్వాత రెండో స్థానంలో నిఖిల్ ఉన్నాడట. సీరియల్ నటుడైన నిఖిల్ మొదటి నుండి గేమ్ పరంగా ముందంజలో ఉన్నాడు. అతడు టాస్క్ లలో కూడా సత్తా చాటాడు. నిఖిల్ కి బాగా ఓట్లు పోల్ అవుతున్నాయి. మూడో స్థానంలో నాగ మణికంఠ ఉన్నాడట. ఆ తర్వాత స్థానంలో ప్రేరణ ఉందట. ఈమె కూడా సీరియల్ నటి. బుల్లితెర ఆడియన్స్ లో ఫేమ్ ఉంది. ప్రేరణ గేమ్ సైతం ఆకట్టుకుంటుంది. పృథ్విరాజ్ ఐదో స్థానంలో ఉండటం విశేషం. 

Share this post

scroll to top