మరోసారి బాలీవుడ్ బ్యూటీకి అదృష్టం..

disha-patani-01.jpg

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు డార్లింగ్. ఇదిలా ఉంటేఇప్పటికే ప్రభాస్ తో కలిసి ఓ సినిమాలో నటించి మెప్పించింది దిశా పటానీ. కొన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఈఅమ్మడుకు ఇప్పుడు ప్రభాస్ సరసన వరుస ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా దిశా పేరు మారుమోగుతుంది. డార్లింగ్ సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. మోడలింగ్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన దిశా పటానీ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని హైలెట్ అయ్యింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.

కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో ఆమె బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అక్కడే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. చాలా కాలం తర్వాత ఇటీవల నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి చిత్రంలో ప్రభాస్ జోడిగా కనిపించింది. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో మరోసారి పాపులర్ అయ్యింది. మరోసారి ప్రభాస్ సరసన కనిపించనుందట. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న సినిమాలో ఇమాన్వీ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మరో హీరోయిన్ దిశా పటానీ కనిపించనుందని అంటున్నారు.

Share this post

scroll to top